టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్బీకే 108 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా.. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్‌ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్.
అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ సారి కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ చేతిపై టాటూ కనిపిస్తోంది. అభిమానులు ఖచ్చితంగా ఇదివరకెన్నడూ చూడని విధంగా ఎన్బీకే 108లో బాలయ్య కనిపించబోతున్నాడని తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది.
ఈ పోస్టర్లు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఎన్బీకే 108 టీంతో కాజల్ అగర్వాల్ ఇప్పటికే జాయిన్ అయింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అన్న దిగిండు ?
ఈసారి మీ ఊహకు మించి?అందరికీ ఉగాది శుభాకాంక్షలు ?
Here’s the First Look of Natasimham #NandamuriBalakrishna garu from #NBK108 ?#NBKLikeNeverBefore @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/dYa3CGi5OF
— Anil Ravipudi (@AnilRavipudi) March 22, 2023