పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఉండనుందని నిర్మాత దిల్రాజు వెల్లడించారు. పౌరాణిక నేపథ్యంలో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది.