మెగా హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’.
ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది.
ఇప్పటివరకూ 10 రోజుల్లో రూ.76 కోట్లు వసూలు చేసి.. రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈనెల 5న ‘విరూపాక్ష’ హిందీలో రిలీజ్ కానుంది.