ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది.
ఇందులో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘బన్వర్ సింగ్ షెకావత్ ‘కు సంబంధించిన సీను న్ను షూట్ చేసినట్లు తెలిపింది. ఈసారి షెకావత్ ప్రతీకారంతో తిరిగి వస్తాడు. అని పేర్కొంటూ.. సుక్కు, ఫాసిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.