మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిన్న రాత్రి షాపూర్ భిటోని స్టేషన్ సమీపంలో గ్యాస్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.
జబల్పూర్ జిల్లాలోని ఓ గ్యాస్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రధాన లైను ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.