నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అనే పేర్లతో పిలుస్తారు. నేటి నుంచి వాతావరణం చల్లబడుతుంది.
కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి, వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకునేందుకు ఈరోజు ప్రజలు తప్పకుండా చేపలు తింటారు. ఇవాళ ఏ ఇంట్లో చూసినా చేపల కూరే దర్శనమిస్తుంది. అలాగే బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు.