ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాటెస్ట్ టాఫిక్ టమాటా. సామాన్యులకు అందనంత ఎత్తుకు టమాటా ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దాదాపు కేజీ టమాటా ధర నూట యాబై రూపాయలకు చేరుకోవడంతో టమాటా వాడటమే మానేశారు.
దేశంలో ఉత్తరాది సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సరఫరా నిలిపేయడంతో టమాటాలు సప్లై ఆగిపోయింది. దీంతో రానున్న రోజుల్లొ వీటి ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క టమాటానే కాకుండా నిత్యవసరమైన కూరగాయల ధరలు సైతం పెరగనున్నాయి.