బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనం రేపిన గులాబీ బాస్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 3 నెలలకు ముందు కేబినెట్ విస్తరణకు సిద్ధమవడంతో ప్రతిపక్షాలకే కాదు…అధికార పార్టీ నేతలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశంలో కాగా కేబినెట్ లో 18 మందికి ఛాన్స్ ఉంది.
అయితే తాండూరు అసెంబ్లీ సీటులో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్నం పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరిన పైలెట్ రోహిత్ రెడ్డికే టికెట్ దక్కునున్నట్లు వస్తున్న వార్తలతో పట్నం వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది..ఓ దశలో పట్నం బ్రదర్స్ ఇద్దరూ రేవంత్ తో టచ్ లోకి వెళ్లినట్లు , కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇక్కడే గులాబీ బాస్ కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు. పట్నం మహేందర్ రెడ్డిని ప్రగతిభవన్ కు పిలిపించి బుజ్జగించిన గులాబీ పెద్దలు తాండూరు అసెంబ్లీ టికెట్ మళ్లీ పైలట్ రోహిత్ రెడ్డికే ఖరారు చేశారు. అయితే పట్నం కారు దిగి హస్తం గూటికి చేరకుండా వ్యూహాత్మకంగా ఆయనకు ఎన్నికలకు 3 నెలల ముందు కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే పట్నంతో పాటు గంపా గోవర్థన్ రెడ్డికి కూడా కేబినెట్ బెర్త్ ఖరారు అవడంతో ఇప్పుడున్న వారిలో ఎవరికో ఒకరికి ఇంకా ఎన్నికలు 3 నెలలే ఉంది కదా అని సర్దిచెప్పి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అయితే చామకూర మల్లారెడ్డి లేదా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి బదులుగా పట్నంకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.