Home / SLIDER / మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు…ఆ కీలక నేతకు మల్కాజ్‌గిరి టికెట్ కన్ఫర్మ్..?

మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు…ఆ కీలక నేతకు మల్కాజ్‌గిరి టికెట్ కన్ఫర్మ్..?

ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంతో కౌరవ సామ్రాజ్యం అంతరించిపోయింది..ఇప్పుడు సేమ్ టు సేమ్ పుత్ర ప్రేమ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ఖతం అవడానికి దారి తీస్తుందా…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు ఖాయమనే తెలుస్తోంది. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ రాకపోవడంతో రగిలిపోయిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే తొలి జాబితాలో మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకే టికెట్ దక్కింది…అయితే మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ దక్కంది. దీంతో అక్కడ తన కొడుకు రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి రెచ్చిపోయాడు. తిరుమలకు వెళ్లిన మైనంపల్లి అక్కడ మంత్రి హరీష్ రావుపై నోరుపారేసుకున్నారు. నోటికి వచ్చినట్లు దూషించాడు. తన కొడుకు మెదక్ లో టికెట్ ఇవ్వకుండా హరీశ్ రావు అడ్డుపడుతున్నట్లు ఆరోపించాడు. సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అంటూ ప్రగల్భాలు పలికాడు…అసలు మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏంటని తెగ రెచ్చిపోయాడు..సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ జరుగుతుండగా…మైనంపల్లి వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా… అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, లేకుంటే ఎంతటి పెద్దవారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. కా

గా మైనంపల్లి హనుమంతరావు గతంలో మెదక్ లో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత మల్కాజ్ గిరికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మెదక్ లో తన కుమారుడికి అక్కడ సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓ రకంగా బెదిరిస్తున్నారనే చెప్పాలి. మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తన కుమారుడికి, తనకు సీట్ ఇవ్వాల్సిందేనని మైనంపల్లి పట్టుబట్టారు. అయితే మెదక్ లో సిట్టింగ్ పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారని అధిష్ఠానం తేల్చి చెప్పింది. అయినా కూడా రెండు సీట్లు కావాలని మైనంపల్లి హనుమంత రావు డిమాండ్ చేశారు. పైగా హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మైనంపల్లిపై బీఆర్ఎస్ పెద్దలు కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు వేయడం ఖరారు అయింది..అంతే కాదు ఆయన స్థానంలో . ప్రత్యామ్నాయ పేర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డితో మరో ఇద్దరి పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మర్రి రాజశేఖర్ రెడ్డి గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి కొద్దితేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినా..మైనంపల్లికి మల్కాజ్ గిరిలో, ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ లో టికెట్ దక్కడం అనుమానమే..ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున టికెట్ కోసం పోటీపడుతున్నారు. మైనంపల్లికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ లోని అసమ్మతి వర్గాలు ఆయన్ని ఓడించడం ఖాయం..ఇక బీఆర్ఎస్ కంచుకోట అయిన మెదక్ లో రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాల్లేవు..ఒకవేళ ఇచ్చినా హరీష్ రావు రాజకీయచాణక్యం ముందు పిల్ల కాకి లాంటి రోహిత్ తట్టుకోవడం ఖాయం..వెరసి కాంగ్రెస్ కు పార్టీలోకి వెళితే…మైనంపల్లి పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయినట్లే చెప్పక తప్పదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat