Home / SLIDER / కేసీఆర్‌పై పోటీ చేయను..మీకో దండం…కామారెడ్డి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

కేసీఆర్‌పై పోటీ చేయను..మీకో దండం…కామారెడ్డి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు ఎదురులేదా…మళ్లీ హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమా..కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడం అంత ఈజీ కాదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికలకు ముందే తట్టాబుట్టా సర్దుకుంటున్నారా…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌ను ఢీకొట్టే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ సంక్షేమ పథకాలతో దూసుకువెళుతున్నారు..ఆయన్ని ఓడించడం అంత సులభం కాదంటూ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో కలకలం రేపాయి. తాజాగా కామారెడ్డి బీజేపీ ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డి సైతం కేసీఆర్ పై పోటీ చేయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయం వేదికగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై పోటీ చేస్తే ఘోర ఓటమి తప్పదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు కాషాయపార్టీకి షాకింగ్ గా మారాయి. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గులాబీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అసలు కేసీఆర్ గురించి ఎంత చెప్పినా ఒడువదని, ఆయన గురించి చెప్పాలంటే సమయమే సరిపోదని పొగడ్తలతో ముంచెత్తారు. 1969 లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది.కొందరు ద్రోహుల వల్ల ఉద్యమం పక్కదారి పట్టింది. 2001 నుంచి కేసీఆర్ సారథ్యంలో మళ్లీ ఉద్యమం ప్రారంభమైంది.ప్రొఫెసర్ జయశంకర్ సలహాతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి..సబ్బండ వర్ణాలను ఏకం చేసి చేసిన మలిదశ ఉద్యమంతో 2014లో కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందని…తెలంగాణ తెచ్చిండు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు నెత్తిన పెట్టుకుని 2 సార్లు గెలిపించారని, ఆయన గురించి చెప్పాలంటే సమయం సరిపోదని బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కొనియాడారు.

ఇక స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్థన్ కూడా మంచి వ్యక్తి అని ప్రశంసలు కురిపించి…కాషాయ కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. గజ్వేల్ లో రోడ్లు, డ్రైనేజీలు , సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి చెందినట్లే..కామారెడ్డి, దోమకొండ, కాచాపూర్, చిన్నమల్లారెడ్డి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాయని కితాబు ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కామారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెంకటరమణారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 20, 21 పూర్తి చేస్తే కామారెడ్డి నియోజకవర్గంలో 3 పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికలకు ఇంకా 3 నెలల ముందే బీజేపీ నేతలు ఇలా చేతులెత్తేస్తుండడంతో తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టే నాయకుడే లేడని , ఒక్క బీజేపీనే కాదు..మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం కూడా ఇదే అని బీఆర్ఎస్ నేతలు అంటున్పారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేయడంకంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ సాక్షాత్తు కామారెడ్డి బీజేపీ ఇన్ చార్జి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో దుమారం రేపుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat