అఖండ విజయం తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి తీస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్..స్కంధ…బోయపాటి మార్క్ టీజర్ తో ఈ మూవీపై మాంచి హైప్ క్రియేట్ అయింది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్లు లేని రామ్ కు స్కంధతో బ్లాక్ బస్టర్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా స్కంధ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది..వచ్చేసింది. కానీ అనుకున్నంతగా లేదు..బోయపాటి పాత సినిమాలైన సింహా, సరైనోడు, జయ జానకి నాయక, వీరవిధేయరామ సినిమాల నుంచి తలో ఒక ముక్క తీసి అతికించినట్లుగా ఉంది..ట్రైలర్ అసాంతం పరమ రొటీన్ గా ఉంది…ఏ మాత్రం కొత్తదనం లేదు..బోయపాటి మార్క్ ఎలివేషన్ సీన్లు, అవే నరుకుడు షాట్లు, అవే రొటీన్ డైలాగులతో ఉన్న ఈ ట్రైలర్ చూసి రామ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. అయితే ట్రైలర్ లో మూవీ స్టోరీ ఏంటో మాత్రం రివీల్ చేయలేదు..జయ జానకి నాయక, సరైనోడు సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పాత్ర తరహాలోనే హీరోయిన్ శ్రీలీల క్యారెక్టర్ కూడా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రామ్ రొటీన్ యాక్షన్, బోయపాటి రొటీన్ సీన్లు, నరుకుడు షాట్లు ఉన్నా బలమైన కథ ఉంటే సినిమా పాస్ అయిపోతుంది…కానీ ట్రైలర్ చూసాకా సినిమా పరిస్థితి ఏంటనేది రామ్ ఫ్యాన్స్ ని కంగారుపెడుతోంది. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలయ్యను తీసుకుని మూవీపై హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు బోయపాటి…మరి స్కంధ మూవీ ఫలితం ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే..
