Home / ANDHRAPRADESH / ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – సీఎం జగన్..!

ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – సీఎం జగన్..!

తెలుగు రాష్ట్రాలలో రాఖీ పర్వదిన వేడుకలు మొదలైపోయాయి..ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల కారణంగా అన్ని పండుగల తేదీలపై అనిశ్చితి నెలకొంది. ప్రతీ పండుగ రెండు రోజులు జరుపుకోవాల్సి వస్తుంది.తిధి, నక్షత్రం ప్రకారం కొందరు పండితులు ఒక రోజు జరుపుకోవాలని చెబితే..మరి కొందరు పండితులు మాత్రం సూర్యోదయం తర్వాత వచ్చిన తిథి ప్రకారం మరుసటి రోజు జరుపుకోవాలని చెబుతున్నారు. రాఖీపండుగ కూడా ఈ నెల 30 అంటే..ఇవాళ ఈ నెల 31 న అంటే రేపు జరుపుకోవాలనే దానిపై అనిశ్చితి నెలకొంది. కాగా చాలా వరకు పండితులు ఈ నెల 30 బుధవారం రాత్రి 9 నుంచి గురువారం ఉదయం 8 గంటల లోపు రాఖీ కడితే సోదరులకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆప్షనల్ హాలీడే కూడా 31 వ తేదీ కావడంతో చాలా వరకు గురువారమే రాఖీ జరుపుకోనున్నారు. కొంత మంది ఇవాళే రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో ఇవాళే రాఖీ సందడి నెలకొంది. రాజకీయ ప్రముఖులు ఇవాళే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్‌ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లెమ్మ‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృత‌జ్ఞతుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్ష‌ణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్న‌గా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నాను అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా ఏపీ సీఎం జగన్ కు మంత్రి రోజాతో పాటు, పలువురు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు రాఖీలు కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat