వర్ధమాన కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంది.ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్‌ను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్ ప్రధానంగా కొన్ని ఎపిసోడ్‌లను తీర్చిదిద్దబోతున్నారని సమాచారం.