Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..?

చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మెడపై మరో కత్తి వేలాడుతోంది..అదే 118 కోట్ల ముడుపుల బాగోతం..ఇప్పటికే టీడీపీ హయాంలో జరిగిన భవన నిర్మాణాల కోసం బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలకు మళ్లించి..ప్రతిగా వందల కోట్లు విదేశాలకు తరలించి…ఆపై బినామీల ద్వారా చంద్రబాబుకు చేరిన అవినీతి బాగోతాన్ని ఐటీశాఖ జారీ చేసిన నోటీసుల్లో బయటపెట్టింది…118 కోట్ల బ్లాక్ మనీకి సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తే…జరిమానా చెల్లించి చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడవచ్చు..కానీ ఐటీ అధికారుల విచారణలో చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూజీ పల్లోంజీ గ్రూపు ప్రతినిధులు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేష్ గుప్తా, లోకేష్ సన్నిహితులు కిలారు రాజేష్, విశాఖకు చెందిన రేలా రఘు వంటి బినామీల ద్వారా కోడ్ లాంగ్వేజీలో కోట్లాది రూపాయలు కొట్టేశాడని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల్లో వాట్సాప్ చాటింగ్ లతో సహా బయటపెట్టి చంద్రబాబుకు షాక్ ఇచ్చింది.

ఈ కేసులో కూలంకుశంగా దర్యాప్తు చేస్తున్న ఐటీ శాఖ ఈ 118 కోట్లే కాదు భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని గుర్తించింది.గతంలో చంద్రబాబుపై వచ్చిన 2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలపై ఆయన పీఏ శ్రీనివాస్ ను విచారించిన ఈడీ ఇప్పుడు ఐటీశాఖ కేసు నేపథ్యంలో మరోసారి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు, 118 కోట్ల అవినీతి బాగోతంలో చంద్రబాబు పీకల్లోతు మునిగాడని జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని…అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని…ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని కాజేసి రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్‌ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు. తనపై జగన్ సర్కార్ రాజకీయ కక్షసాధిస్తుందని, కేసుల పేరుతో వేధిస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యలను రాంబాబు ఖండించారు. ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేమని కుండబద్ధలు కొట్టారు. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారంటూ రాంబాబు తేల్చి చెప్పారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్‌మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అయిన బీఎస్ రాంబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ కేసులో చంద్రబాబు దోషిగా జైలుకు వెళతాడా..లేదా వ్యవస్థలను మేనేజ్ చేసి, మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో లాబీయింగ్ చేసి తనపై దర్యాప్తు జరగకుండా ఏళ్ల తరబడి స్టేలు తెచ్చుకుంటారా అనేది చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat