Home / ANDHRAPRADESH / నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్టైన స్కామ్‌స్టర్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపుడుతున్న చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ టీమ్..ఇవాళ విచారణ నిమిత్తం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ చుక్కలు చూపిస్తోంది. బావ బాబు పర్మినెంట్‌గా బొక్కలోకి పోయేటట్లు ఉన్నాడని గ్రహించాడు మన గ్రేట్ బాలయ్య…..చంద్రబాబు అరెస్ట్ అయిన మరునాడే పార్టీ ఆఫీసుకు వెళ్లి..తన బావ సీట్లో కూర్చుని..అధైర్యపడకండి..టీడీపీని నడిపించేందుకు నేనున్నా అంటూ సింహా లాగా డైలాగులు కొట్టాడు..దీంతో పక్కనే ఉన్న అల్లుడు లోకేష్‌‌కు, జైల్లో ఉన్న బాబుకు బీపీ లేసింది..వెంటనే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ని పిలిపించి..తమ్ముడు లోకేష్‌ని అప్పగించి..బామ్మర్ది బాలయ్యను సైడ్ చేశాడ..ఇక పచ్చమీడియా కూడా జైలు నుంచే అందిన ఆదేశాల ప్రకారం.. బాలయ్య భజన మానేసి..ఆయన కూతురు, నారావారి కోడలు అయిన బ్రాహ్మణికి జాకీలు వేసే పనిలో పడింది..పాపం….ఓ పక్క తన తండ్రి స్థాపించిన పార్టీని మళ్లీ తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నా..తన కూతురి కాపురం కోసం బావ చంద్రబాబు చెప్పిన మాట వినకతప్పేలా లేదు..దీంతో సింహంలా ఉండే బాలయ్యకాస్తా పిల్లిలా మారిపోయాడు.అటు టీడీపీని మళ్లీ లాక్కోలేక..కూతురి కాపురం కోసం కాంప్రమైజ్ కాలేక పాపం ఏం చేయాలో అర్థంకాక బుర్రలో చిప్ దొబ్బినట్లైంది. అందుకే అసెంబ్లీలో బావ అరెస్టుకు నిరసనగా…పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ..తొడలు గొడుతూ..మీసాలు మేలేస్తూ..వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా పిడికిలి అడ్డంగా తిప్పి దె….తా అన్నట్లుగా అసభ్య సైగలు చేస్తూ…బిత్తిరి వేషాలు వస్తున్నాడు.

.ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల వంక చూస్తూ బాలయ్య చేతితో అసభ్యంగా సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అసెంబ్లీలో బాలయ్య చేసిన సైగలు అసభ్యంగా ఉన్నాయని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియాలో బూతు బాలయ్య..ఇక నువ్వు మారవా..మహిళల ముందు అవేమి బూతు సైగలు అంటూ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు.. అసెంబ్లీలో బాలయ్య బూతు సైగలపై టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది… అసెంబ్లీలో చేసిన బూతు సైగలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హీరోయిన్ మాధవి లత.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న రౌడీలు. సారీ.. నేను తప్పు చెప్పాను. వీళ్లను ఎమ్మెల్యేలు అంటారు అనుకుంటా కదా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్కసారిగా బాలయ్యనే రౌడీ అంటూ మాధవీ లత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు. బాలయ్య అభిమానులు రెచ్చిపోతున్నారు. మా బాలయ్యనే రౌడీ అంటవానే…ల..జ అంటూ పచ్చమూకలు కామెంట్లతో మాధవిలతపై విరుచుకుపడ్డారు.. దీంతో మాధవి లత స్పందిస్తూ.. ‘హహహ.. ప్రతివాడూ తనకు నచ్చేలా పోస్ట్ చేయాలని ఆశ పడతాడు. మరి 5 లక్షల మెంటాలిటీలను ఎలా చదవాలి’ అని రాసింది. ఇదే పోస్టులో మాధవి లత.. ‘బొచ్చులోది ఇది నా పేజ్. నాకు నచ్చిందే పెడతాను. నాకు 360 డిగ్రీల్లోనూ పర్‌ఫెక్ట్ అనుకున్న దానినే పోస్ట్ చేస్తాను. నా దేవుడు కృష్ణుడు చెప్పిన రాజనీతిని పెడతాను. ఉంటే ఉండండి.. చస్తే చావండి నాకేంటి? గెటౌట్’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. మరి బాలయ్యను రౌడీ అంటూ హీరోయిన్ మాధవిలత చేసిన వ్యాఖ్యల దుమారం మరెంత చెలరేగుతుందో చూడాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat