జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.
అదేవిధంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.