నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది.
ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.