మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్‌తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో పాటు గురువారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. అయితే, దేశభక్తి, ఫ్యామిలీ సెంటిమెంట్లను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్ అందాలు, సాయి ధరమ్ తేజ్ నటన ఈ మూవీకి హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
