సీనియర్ నటి శ్రీదేవి హఠాన్మరణానికి కారణమైన గుండెపోటు మరోసారి త్రీవ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్న విషయం తెలిసిందే. నివురు గప్పిన నిప్పులాంటి ఈ వ్యాధి ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండానే కబలిస్తోంది. ముఖ్యంగా బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలోనే చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నట్టు వార్తలు వింటున్నాం. తాజాగా శ్రీదేవి కూడా బాత్రూమ్లోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
సామాన్యులు కూడా బాత్రూమ్లో ఉన్నప్పుడు గుండెపోటుకు గురైన సందర్భాలు అనేకం. దీనికి గల కారణం ఏమిటి? యూఐటీమ్ ప్రొఫెసర్ దీనికి సమాధానం చెప్పారు. బాత్రూమ్లోకి ప్రవేశించగానే స్నానం చేసే పద్ధతి కూడా గుండెపోటుకు కారణం కావొచ్చని ఆయన తెలిపారు. ‘‘చాలామంది స్నానం చేసే క్రమంలో ముందుగా తమ తలను తడుపుకుంటారు. అది తప్పుడు పద్ధతి. అలా చేయడం వల్ల వేడి రక్తం గల మానవ శరీరం ఒక్కసారిగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు.
ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకునే క్రమంలో నీళ్లు పడిన తల భాగం వైపునకు రక్త ప్రసరణ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఎవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటుకు కారణమవుతాయి. ఈ కారణంగా ఒక్కోసారి పక్షవాతం కూడా రావొచ్చు. అలా కాకుండా స్నానం చేసేటపుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని వేసుకోవడం మంచి పద్ధతి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు స్నానం చేసేటపుడు ఈ పద్థతినే పాటించాలి’’ అని ఆయన సూచించారు అని ప్రస్తుతం ఇది ముఖ చిత్రం ,వాట్సాఫ్ లో చక్కర్లు కొడుతుంది.