ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు దర్శకరత్న దాసరి నారాయణరావు వైసీపీకి మద్దతిచ్చారు. ఆయన కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్, అల్లుడు రఘునాథ్‌బాబు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
అయితే సీనియర్ హీరో నాగార్జున కూడా గత కొన్నేళ్లుగా వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుంచి వైసీపీ తరపున అక్కినేని నాగార్జున బరిలో నిలచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నాగార్జున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాగార్జున బహిరంగంగా ఆయనకు మద్దతిచ్చారు. అలాగే సుమంత్, జగన్, నాగార్జున కూడా స్నేహితులే.. అలాగే ఈ ఇరువురికి బంధుత్వం కూడా ఉందట. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపధ్యంలో మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్రలో నాగార్జున కూడా పాల్గొననున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇటీవల ప్రధాన మీడియాలో కూడా ఈ వార్తను ప్రసారం చేసారు. ఇప్పటివరకూ సోషల్ మీడియాకే పరిమితం అయిన జగన్నాగుల కలయిక ప్రధాన మీడియాకు చేరింది. గతంలోనూ అక్కినేని అభిమాన సంఘ నాయకులు సైతం గడగడపకూ వెళ్లి నవరత్నాలను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని అభిమాన సంఘం నాయకుడు జగన్ కలిసి మరీ వివరించారు. ప్రస్తుతం బస్సుయాత్రలో నాగార్జున పాల్గొంటారా లేదా బస్సు యాత్ర సమయంలో వచ్చి జగన్ కు కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకుంటారా అనేది ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కలయికకు జగన్ అభిమానులతో పాటు నాగార్జున అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటికితోటు నాగార్జున ఇటీవల పలు సేవాకార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతుండడంతో ఆయన రాజకీయ అరంగేట్రానికి సమయం దగ్గర పడినట్టు కనిపిస్తోంది.