తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం.
ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది.
అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన యువకులకు అవకాశముంది. శుక్రవారం నుంచి దరఖాస్తులు ప్రారంభమై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు వరకు కొనసాగనున్నది.