బక్కపలచని అందం తన సొంతం.. చక్కని అభినయం.. చూస్తే కుర్రకారు మతిని పొగొట్టే సెక్సీ ఆఫియల్స్.. వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికెదిగిన హీరోయిన్.. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగెట్టి స్టార్ హీరో సరసన నటించే స్థాయికెదిగిన అందాల రాక్షసి.
ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తోన్నారా…?. ఆమె హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సాక్షిగా ఈ ముద్దుగుమ్మకు అవమానం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో జరిగిన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాట్యప్రదర్శనకు సిద్ధమైంది. అయితే ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ కార్యక్రమం ఉండగా.. దాన్ని పక్కనెట్టి చిరుతో మాట్లాడించారు. దీంతో ఆమె ప్రదర్శనకు సమయం లేదు. దీంతో తనకు తీవ్ర అవమానం కలిగినట్లు భావించిన రకుల్ అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.