తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే.
అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద బతుకమ్మ- పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు.
శ్రీమతి కవిత గారు మాట్లాడుతూ ఏ గడ్డపై ఉన్నా స్వీయ సంస్కృతి పై మక్కువతో, మాతృభూమి పై మమకారంతో మన సంస్కృతి ని పండుగలను ప్రవాస తెలంగాణీయులు జరుపుకుంటూ ఉండడం సంతోషకరమన్నారు. ఈ సారి జానపద కళాకారులకు పెద్దపీట వేస్తు కార్యక్రమం రూపొందించామని ఖతర్ తెలంగాణ జాగృతి శాఖ అధ్యక్షులు శ్రీమతి నందిని అబ్బగౌని అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీధర్ అబ్బాగౌని, అభిలాష్ బండి, ప్రశాంత్ పూస మరియు పావని గణేష్ తదితరులు పాల్గొన్నారు.
-తెలంగాణ జాగృతి ఖతర్- శాఖ నిర్వహిస్తున్న
అక్టోబర్ 4న దోహా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ , అశోక హాల్ లో సాయంత్రం 4గం.లకు ప్రారంభమవుతుందని నందిని అబ్బగోని తెలిపారు.
మన మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం రండి.
ఖండాలు దాటిన మన జానపద సువాసనల్ని దోహ ఖతర్ గడ్డపై ఆస్వాదిద్దాం రండి..
Post Views: 339