Home / MOVIES / ముచ్చటగా మూడోసారి బాలయ్య

ముచ్చటగా మూడోసారి బాలయ్య

టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్.

ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి.

ఇటీవల బాలయ్యకోసం తయారుచేసుకున్న కథను వినిపించగానే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బోయపాటి సన్నిహితులు చెబుతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారిస్తుండగా వచ్చే వేసవికి ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీతో బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ కొడతారో లేదో వచ్చే వేసవి వరకు ఎదురుచూడాల్సిందే..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat