తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి.
కొన్ని చోట్ల అమలు కూడా చేస్తున్నారు.తాజాగా మిషన్ భగీరథను తెలంగాణ రాష్ట్ర తరహాలో దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. నిన్న సోమవారం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి “తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగునీరందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథను అమలు చేస్తున్నాము.
ఈ పథకాన్ని ఆర్థిక కోణంలో చూడోద్దు. ఈ పథకానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయసహకారాలను అందించాలని “కేంద్ర మంత్రిని కోరారు. దీనికి స్పందనగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ” మిషన్ భగీరథ పథకం చాలా మంచి కార్యక్రమం. దీని తరహాలోనే దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వముంది. మిషన్ భగీరథకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని”తెలిపారు.