తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో చెన్నై భామ త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. అంతేకాదు 96 సినిమాలో త్రిష నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అవార్డులను కూడా గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా తర్వాత త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. మళ్లీ వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె చేసిన సినిమా ‘పరమపథం విలయాట్టు’. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది త్రిష. ఏడాది కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే కరోనా వైరస్ కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేస్తారని అనుకుంటున్న తరుణంలో OTTకి ఇచ్చేశారు. దాంతో ఈమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఒక్క ముక్క కూడా చెప్పకుండా నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తుండటంతో త్రిష బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఈమెకు ఇంతకంటే అవమానం లేదు అంటూ అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇందులో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉందని.. థియేటర్లో విడుదల అయితే తన కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుందని త్రిష భావించింది. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి.