తమది కాని రూపాయి దొరికినా కాజేసే వ్యక్తులున్న రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.45లక్షలను నిజాయతీగా పోలీసులకు అప్పజెప్పాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. కాయబంధాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలాంబర్ సిన్హాకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఉన్నవన్నీ రూ.2వేలు, రూ.500 నోట్లే. నీలాంబర్ నిజాయతీని అందరూ మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు ఆయనకు రివార్డు కూడా ఇచ్చారు. అయితే ఆ …
Read More »ఎన్ని ఆస్తులున్నా.. నేను సంతోషంగా లేను: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
ఎన్ని పేరు ప్రతిష్ఠలు, ఎంత విలువైన ఆస్తులున్నా తాను సంతోషంగా లేనని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ అన్నారు. అనారోగ్యానికి గురైతే కావాల్సిన వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ సంస్థ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకి ఆత్మ సంతృప్తిని అందించాయని చెప్పారు. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి తెలిసిందన్నారు. హిమాలయాలంటే సాధారణమైన మంచుకొండలు …
Read More »మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్‌లో అతిభారీ వర్షాలు కురిసే …
Read More »హీరోయిన్ సదా క్లాసీ లుక్.. అదిరిపోయిందిగా!
సీనియర్ హీరోయిన్ సదా క్లాసీ లుక్‌తో అదరగొట్టింది. ఇటీవల ఆమె తీసుకున్న ఫొటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. పర్పుల్, పింక్, బ్లూకలర్ శారీల్లో క్లాసీ లుక్‌తో యువత మనసులు దోచేస్తోంది.
Read More »డాక్టర్లు 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు: కేటీఆర్
మంత్రి కేటీఆర్ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …
Read More »కేటీఆర్‌కు ఏపీ దివ్యాంగ బాలిక అరుదైన గిఫ్ట్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగ డ్రాయింగ్ ఆర్టిస్ట్ స్వప్నిక్ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. చిన్నతనంలో విద్యుత్‌షాక్‌తో రెండు చేతులూ కోల్పోయిన స్వప్నిక.. నోటితోనే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. సందర్భాన్ని బట్టి పొలిటికల్ లీడర్స్, సినీ హీరోల డ్రాయింగ్‌ను ఆమె వేస్తూ ఉంటుంది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని స్వప్నిక గీసింది. కేటీఆర్ చేసే సేవా కార్యక్రమాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు …
Read More »హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం
సీనియర్‌హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్‌గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది …
Read More »చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు. అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి …
Read More »కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తనస్థానంలో శికారిపుర నియోజకవర్గం నుంచి చిన్నకుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని చెప్పారు. శికారిపుర ప్రజలు అనేకసార్లు తనను గెలిపించారని.. తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆదరించాలని యడియూరప్ప కోరారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు …
Read More »