ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …
Read More »నాకు ఆ పాత్ర నచ్చలేదు కానీ.. చేయాల్సి వచ్చింది: సత్యరాజ్
యాక్టర్ సత్యరాజ్ అంటే చాలా మందికి తెలీదు.. కానీ ‘కట్టప్ప’ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారాయన. ‘బాహుబలి’లో ఆయన చేసిన పాత్ర అంతలా ఎలివేట్ అయింది. ఇటీవల ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఓ స్టార్ హీరో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీలో పాత్ర తనకు నచ్చనప్పటికీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన …
Read More »బాబోయ్.. కేరళలో ‘నోరో వైరస్’ కలకలం..
కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …
Read More »అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ …
Read More »పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2022 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి దీన్ని విడుదల చేశారు. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హైదరాబాద్,మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. జులై 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్ ఫీతో జులై 15 వరకు అవకాశముంది. జులై 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ట్రాన్స్‌ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. జూన్ 17లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సీఎం సంతకం పూర్తయిన నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
Read More »ఆ ఫొటోలుఎమ్మెల్యే రఘునందన్‌కి ఎలా చేరాయబ్బా?
పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్‌పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తన ప్రెస్‌మీట్‌లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ ఘటనపై జూబ్లీహిల్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రఘునందన్ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు …
Read More »మంత్రులకు ఒడిషా సీఎం షాక్.. 20 మంది రాజీనామా
ఒడిషాలో రాష్ట్ర మంత్రులకు సీఎం నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ఆదేశాలతోనే వారంతా రాజీనామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల తీరుతో బీజేడీ (బిజూ జనతాదళ్) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆరోపణలతో మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాలని నవీన్ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవలే బీజేడీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంది. ఐదోసారి సీఎంగా ఉన్న నవీన్.. వచ్చే …
Read More »చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్: వెలంపల్లి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రాడ్లు, కర్రలతో ఎటాక్
హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ హోటల్ మేనేజ్‌మెంట్ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ కోసం అక్కడికి వెళ్లిన బాయ్.. అరగంట పాటు వెయిట్ చేశారు. ఎందుకు ఆలస్యమవుతోందని హోటల్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించడంతో అక్కడకున్న సిబ్బంది రాడ్లు, కర్రలతో ఎటాక్ చేశారు. దీంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్‌కి పంపించారు. హోటల్ …
Read More »