సాధారణంగా ట్రైన్ ఎంత పొడవుంటుంది? అరకిలోమీటరు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కొన్ని గూడ్స్‌రైళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే కిలోమీటరు పొడవు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది. ఆ దేశంలో రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చి 175 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలోమీటర్లుండే (సుమారు 2 కిలోమీటర్లు) ట్రైన్‌ను నడిపింది. 100 బోగీలు, 4 …
Read More »ఇవాళ మునుగోడులో కేసీఆర్ సభ.. ఎమ్మెల్యేల బేరసారాలపై కౌంటర్?
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. అన్ని పార్టీలు ప్రచారంలో టాప్‌గేర్‌కు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. చండూరులోని బంగారిగెడ్డ వద్ద ఆదివారం జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. …
Read More »బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబ బాధ్యతలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు …
Read More »సమంతకు అరుదైన వ్యాధి.. షాకిచ్చిన నటి
ప్రముఖ నటి సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది. ‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూనిటీ …
Read More »కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్..!
ప్రముఖ హీరో ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్, హాజరవుతారు. పునీత్ …
Read More »రెండో పెళ్లిపై పుకార్లు.. స్పందించిన నటుడు పృథ్వీ
రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లకు నటుడు పృథ్వీరాజ్ చెక్ పెట్టారు. తన కంటే రెట్టింపు వయసు ఉన్న అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నారు. 57 ఏళ్ల పృథ్వీ.. 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు. మొదటి భార్యతో జరిగిన గొడవల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. శీతల్ అనే అమ్మాయితో గతకొన్ని రోజులుగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న …
Read More »పూరీ జగన్నాథ్ ఫ్యామిలీకి సెక్యూరిటీ.. కోర్టుకెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!
లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ …
Read More »త్వరలో ఓటీటీలోకి పొన్నియిన్ సెల్వన్!
ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్‌కానుంది. చోళుల సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేపథ్యంలో చారిత్రక ఇతిహాసంగా రూపొంది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేశ వ్యాప్తంగా అద్భుతమైన రికార్డును దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈమూవీ …
Read More »గుడ్‌న్యూస్.. ఉప్పల్ స్కై వాక్ రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే!
ఉప్పల్ జంక్షన్.. నిత్యం అత్యంత రద్దీగా ఉంటే ఏరియా. ఇక్కడి ట్రాఫిక్‌లో అటు నుంచి ఇటు వెళ్లేందుకు రోడ్ క్రాస్ చేయాలంటే పాదచారులకు పెద్ద గండమే. ఇందుకు చాలా సమయం కూడా వృథా అవుతుంది. పాదచారుల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూ.25 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ హంగులతో స్కై వాక్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ స్కైవాక్ తుది దశకు చేరుకుంది. కొత్త ఏడాదికి ఈ స్కైవాక్‌ను …
Read More »బిగ్‌బాస్ షో నిలిచిపోతుందా.. నాగ్, స్టార్‌మా ఎండీకి హైకోర్టు నోటీసులు!
బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »