అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …
Read More »కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »బాలికలపై ముకేశ్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్న శక్తిమాన్, మహాభారతం ధారావాహికల ద్వారా అందరి మన్నలను పొందిన సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి. ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో …
Read More »చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Read More »MLA కాకుండానే 8వ సారి సీఎం అవుతున్న నితీశ్ కుమార్
బిహార్ రాష్ట్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, …
Read More »ఏపీ టీడీపీకి బిగ్ షాక్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి …
Read More »ఏపీ విద్యార్థులకు శుభవార్త.
ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా తదుపరి విడత నిధులను రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, …
Read More »వికారాబాద్ లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వికారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 14న వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించనున్నరు సీఎం కేసీఆర్.. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో అధికారులు సెలవులో వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు పూర్తి …
Read More »అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »