కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

Coronavirus or Flu virus isolated - Microbiology And Virology Concept