తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వికారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 14న వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించనున్నరు సీఎం కేసీఆర్.. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో అధికారులు సెలవులో వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.