ఏపీ అధికార పార్టీ అయిన వైఎస్సార్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వచ్చే నెలలో రాష్ట్రంలోని మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన వైసీపీ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆ పార్టీ నేతలు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించి.. రాష్ట్ర ప్రజలకు సేవ …
Read More »టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర
టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు చేసిన భారత్.. టీ20ల్లో ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్ చేసిన జట్టు కొనసాగుతోంది. తాజాగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 225 రన్స్ చేసింది. దీంతో ఏకంగా 21వ సారి 200పై స్కోర్ చేసిన జట్టుగా మారింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.
Read More »మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?
మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …
Read More »భారతదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 14,506 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (11,793) 2,713 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30 మంది వైరస్లో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది.
Read More »వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో …
Read More »ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై …
Read More »తండ్రి అయిన దిల్ రాజు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాత.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దిల్‌రాజు మరో సారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి వైగా రెడ్డి బుధవారం తెల్లవారుజామున మగబిడ్డకి జన్మనిచ్చారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో హార్ట్ఎటాక్ రావడంతో మరణించారు. దిల్ రాజు కూతురైన హన్షిత కోరిక మేరకు దిల్‌రాజు 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. …
Read More »మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి స్టార్ హీరోయిన్ … సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్నేండ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఆ …
Read More »నక్క తోక తొక్కిన త్రిష
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటి న ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక,నయనతార,ప్రభు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా కొత్తగా ‘చంద్రముఖి-2’ తీస్తున్న విషయం మనకు తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. …
Read More »కోనసీమ అల్లర్లపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ తో పాటు తనను అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించాను..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇచ్చిన ధైర్యంతో తిరిగి వచ్చానని ఆయన చెప్పారు. అల్లర్లతో కోనసీమ పదేళ్లు …
Read More »