తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాత.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దిల్‌రాజు మరో సారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి వైగా రెడ్డి బుధవారం తెల్లవారుజామున మగబిడ్డకి జన్మనిచ్చారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో హార్ట్ఎటాక్ రావడంతో మరణించారు.
దిల్ రాజు కూతురైన హన్షిత కోరిక మేరకు దిల్‌రాజు 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ ‘దిల్‌రాజు అన్నా కాంగ్రాచులేషన్స్’ అని తెలుపుతూ.. ఆయనకు కొడుకు పుట్టాడని ట్విట్టర్‌లో వెల్లడించాడు.