ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.
Read More »నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
Read More »సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?
లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.
Read More »ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.
Read More »పాలిటిక్స్ రీఎంట్రీపై చిరంజీవి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహాన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు చిరంజీవి. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు రూమర్స్ మాత్రమే అని.. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని చిరంజీవి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. పదవులకు అతీతంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇక, తాను సీట్ల ఆఫర్లకు ఆశపడేవాడిని కాదని, అలాంటివి కోరుకోవడం లేదని …
Read More »రాజ్యసభ సీటుపై మెగాస్టార్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.మెగాస్టార్ చిరంజీవి ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి మెగాస్టార్ కు రాజ్యసభ సీటు ఖరారైందని వార్తలు చక్కర్లు కొట్టాయి.. దీంతో తనకు రాజ్యసభ సీటు అన్న వార్తలను ఖండించారు మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం.. సీఎం జగన్ ను …
Read More »అల్లు అర్జున్ కు మరో అరుదైన రికార్డు
వరుస సినిమాలతో పాటు హిట్లను సొంతం చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో జోరు మీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరో క్రేజీ రికార్డు సృష్టించాడు. బన్నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో కోటి 50 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏళ్లలోనే అల్లు అర్జున్ …
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. ఆమెకు స్వల్పంగా న్యూమోనియా లక్షణాలు ఉండగా తగ్గిపోయాయని, కరోనా ఆమెపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లత కోలుకుంటున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఉషా తెలిపారు. కాగా, కొవిడ్ నిర్ధారణ కావడంతో లతా మంగేష్కర్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో …
Read More »దేశంలో కొత్తగా 2,47,417 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 27 శాతం అధికంగా వెలుగు చూశాయి. బుధవారం 84,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి పెరిగింది.
Read More »ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.
Read More »