Home / rameshbabu (page 558)

rameshbabu

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్‌ నంబర్‌తో ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …

Read More »

మీరు Water ఎక్కువగా తాగుతున్నారా..?

మన శరీరం బాగా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. ఇలా అని.. చాలామంది రోజులో చాలా ఎక్కువ నీరు తాగేస్తుంటారు. అది కరెక్ట్ కాదట. నీరు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్కు దారి తీస్తుంది. మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తే.. అలసిపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు.. ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్పభావాల్లో ఒకటి. నీరు ఎక్కువైతే రక్తంలో …

Read More »

సరికొత్తగా అందాల రాక్షసి

తమిళ బిగ్ బాస్-5 హోస్ట్ గా అందాల రాక్షసి..స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యవహరించనుందట. కమలహాసన్ కి కరోనా సోకిన నేపథ్యంలో.. ఆయన కుమార్తె శ్రుతిహాసన్ హోస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమల్ పోరూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు వారాల పాటు కార్యక్రమానికి దూరమవనున్నారు. దీంతో కమల్ హోస్ట్ చేసే శని, ఆదివారాల ఎపిసోడ్లకు శ్రుతిని బిగ్బాస్ రంగంలోకి దింపే …

Read More »

దేశంలో కొత్తగా 7,579 Carona Cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

Read More »

జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం

ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

Read More »

Break Fast లో ఏమి తింటున్నారు..?

బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.

Read More »

Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలోనే మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర …

Read More »

తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను కొత్త జిల్లాలవారీగా విభజించి, కేటాయిస్తామన్నారు. ఇవి కాకుండా మరో 1,500 బోధనేతర, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat