హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్ …
Read More »రైతుబీమాకు 1,450 కోట్లు
రైతుబీమా పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లను విడుదలచేసింది. మంగళవారం వ్యవసాయంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 2021-22 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెక్కును మంత్రులు ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు. రైతులపై ఆర్థికభా రం పడొద్దనే ఉద్దేశంతో మూడేండ్లుగా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులు.. ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్, …
Read More »తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్ కుమార్ వివాహ వార్షికోత్సం కావడంతో …
Read More »త్వరలోనే పోడు భూములకు పరిష్కారం
ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. …
Read More »బెండకాయ కూర తింటే ఉంటది ఇక..?
బెండకాయ కేవలం వంటల్లోనే కాదు… దివ్యమైన ఔషధంగానూ ఉపయోగడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు.బెండకాయలోని లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని …
Read More »GHMC మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ …
Read More »కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్ లను అందించిన ఎమ్మెల్యే నోముల భగత్
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. …
Read More »దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,88,508 ఉన్నాయని.. 139 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.21శాతం ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని పేర్కొంది. …
Read More »యూపీలో దారుణం – మహిళా రోగిపై దవాఖాన సిబ్బంది లైంగిక దాడి
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మీరట్ జిల్లాలోని బోధనాస్పత్రిలో మహిళా మానసిక రోగిపై అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని మీరట్ మెడికల్ కాలేజ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళ మానసిక పరిస్ధితి సజావుగా లేకపోవడంతో తల్లితండ్రులు 2017లో ఆమెను దవాఖానలో విడిచిపెట్టి వెళ్లారు. నిందితుడు దవాఖానలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ …
Read More »వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …
Read More »