తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, …
Read More »హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇన్చార్జ్‌లు ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌లను నియమించింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. అలాగే కో ఇన్చార్జ్‌లుగా మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది. హుజురాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ రూరల్‌కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీకి …
Read More »రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రి పువ్వాడ, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,16,688కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,462గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,598 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »శారీలో అందాలను ఆరబోస్తున్న నివేదా థామస్
జెంటిల్‌మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఈ మూవీ నివేదా కెరీర్ సాఫీగా సాగిపోయేలా బ్రేక్ ఇచ్చింది. ఈ భామ ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించింది. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అందరినీ పలుకరించే నివేదా థామస్ ఈ సారి ఎవరూ ఊహించని సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరూ స్టన్ అయ్యేలా చేసింది. …
Read More »పానుగంటి రమేశ్ కుటుంబానికి అండగా ఉంటా
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మంత్రి హరీశ్‌రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు మందుల రాఘవారెడ్డి తల్లి నర్సవ్వ మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆ కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. …
Read More »జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …
Read More »బాలీవుడ్ భామతో మెగాస్టార్ రోమాన్స్
మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించబోతుందట. బాబీ టీం సోనాక్షిసిన్హాను సంప్రదించగా..సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎమోషన్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ …
Read More »30దాటిన ఏమాత్రం తగ్గని శ్రియా
మూడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలు ఏమీ కనబడవు. అందంలో కుర్ర హీరోయిన్లకు తానేమి తక్కువ కాదంటోంది శ్రియాశరణ్. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రియాశరణ్ సాగరంలో జలకాడుతూ చిల్ అవుట్ అయింది. గ్రీన్ అవుట్‌పిట్‌లో అందాలు ఆరబోస్తూ..నీటిలో మృదువైన పాదాలను ఉంచి సరదాగా ఆడింది. నీటిలో హమ్ చేస్తున్న ఫొటో, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ …
Read More »కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీల్లో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం
తెలంగాణ రాష్ర్టంలోని కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీలకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు మెడికల్ కాలేజీలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కాలేజీలకు 900 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ నియామకాలను తాత్కాలిక ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. 2022 మార్చి నెలాఖరు వరకు సేవల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Read More »