Home / SLIDER / హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇన్చార్జ్‌లు ఖరారు

హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇన్చార్జ్‌లు ఖరారు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌లను నియమించింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. అలాగే  కో ఇన్చార్జ్‌లుగా మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది. 

హుజురాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ రూరల్‌కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీకి ఎంపీ అరవింద్, జమ్మికుంట రూరల్‌కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు.., ఇంకా వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంట- మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి,  కమలాపూర్- మాజీ  ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్; కోఆర్డినేటర్‌గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులను పార్టీ నియమించింది.