మూడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలు ఏమీ కనబడవు. అందంలో కుర్ర హీరోయిన్లకు తానేమి తక్కువ కాదంటోంది శ్రియాశరణ్.
ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రియాశరణ్ సాగరంలో జలకాడుతూ చిల్ అవుట్ అయింది. గ్రీన్ అవుట్‌పిట్‌లో అందాలు ఆరబోస్తూ..నీటిలో మృదువైన పాదాలను ఉంచి సరదాగా ఆడింది.
నీటిలో హమ్ చేస్తున్న ఫొటో, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో ఫీడ్ చేసింది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేందుకు..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీనికి ఫాలోవర్లు అద్బుతం, క్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రియా శరణ్ లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. శ్రియా ప్రస్తుతం గమనం, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటిస్తోంది.