అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
Read More »తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇక గతరాత్రి గం.8 వరకు రాష్ట్రంలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మరణాలు సంభవించాయి. అటు ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులున్నాయి
Read More »‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మికా
గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …
Read More »కొబ్బరి నీళ్లు తాగితే
కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటొ తెలుసుకుందాం ఇప్పుడు.. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. డయాబెటీసను తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది – గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది చాలాసేపు వ్యాయామం తర్వాత తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది వేసవి వస్తుంది కాబట్టి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగండి
Read More »కరివేపాకుతో బరువు తగ్గడం ఎలా..?
10-20 కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఇక కరివేపాకుతో నోటి అల్సరూ తగ్గించవచ్చు. కరివేపాకును పొడిగా చేసి అందులో కొంచెం తేనె కలిపి తాగాలి ఇలా చేస్తే 2-3 రోజుల్లో సమస్య దూరం అవుతుంది. పెదాలు, నోరు మండటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
Read More »జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
Read More »ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …
Read More »బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్
టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది
Read More »బంగారం ప్రియులకు శుభవార్త
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది
Read More »తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణలో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 8.12 మీ., అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో (0.10 మీ.). పెరిగాయంది. ఇక 5 జిల్లాల్లో తగ్గుదల కన్పించిందని వెల్లడించింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 0.82 మీటర్లు తగ్గింది. సంగారెడ్డి, నిజామాబాద్ (తూర్పు), మెదక్, సిద్దిపేట, భద్రాద్రి నిర్మల్, కామారెడ్డి, వికారాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ లోతుకెళ్తేనే నీటి జాడ ఉంటోంది.
Read More »