ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ …
Read More »ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 మంది కరోనా బారినపడ్డారు. 49,348 మందికి పరీక్షలు నిర్వహించగా 625 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కృష్ణాలో 103, పశ్చిమగోదావరి 93, విశాఖపట్నం 88, గుంటూరు 68, చిత్తూరు 61 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 8,67,063 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8,48,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో …
Read More »తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది. 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం …
Read More »ఆ “స్టార్ హీరో” ని పెళ్ళి చేసుకోవాలనుకున్న మంచు లక్ష్మీ
మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచు లక్ష్మీ అందరికీ పరిచయమే. మోహన్ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకున్న మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అది అలాంటిలాంటి విషయం కాదు. తన లవ్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఆమె రివీల్ చేశారు. ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో …
Read More »జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. – పోలింగ్ ఏజెంట్ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి – పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన బ్యానర్ ఏర్పాటుకు అనుమతి – బూత్‌ల ఏర్పాటు …
Read More »ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం : మంత్రి కేటీఆర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధిని జోడెడ్లులాగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష …
Read More »ఫుల్ జోష్ లో పూజా హెగ్దే
నీరంగంలో అడుగుపెట్టే ప్రతి కథానాయిక అగ్ర స్థానానికి చేరుకోవాలని తపిస్తుంటుంది. వృత్తిపరమైన పోటీని తట్టుకొని తారాపథంలో దూసుకుపోవడం అంత సులభం కాదు. అయితే తన విషయంలో మాత్రం అంతా అనుకున్నట్లుగానే జరుగుతోందని, కెరీర్ ఆరంభంలో కన్న కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. మంగళూరు సోయగం పూజాహెగ్డే. ‘ప్రస్తుతం వృత్తిపరంగా చాలా సంతోషంగా ఉన్నా. నేను కోరుకున్న అవకాశాలు లభిస్తున్నాయి. నేను అభిమానించే హీరోలతో సినిమాలు చేసే అదృష్టం …
Read More »అవన్నీ నిజాలు కావు-రకుల్ ప్రీత్
తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తు చిత్రాలకు సంబంధించి పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి రకుల్ తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రకుల్‌ప్రీత్‌సింగ్ టీమ్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని తెలిపింది. రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న తాజా …
Read More »సీఎం కేసీఆర్ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను …
Read More »గుంపులుగా వాళ్లు.. సింగిల్‌గానే సీఎం
ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …
Read More »