బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది.. మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది
Read More »తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.
Read More »కరోనా అప్డేట్ – దేశంలో 86 లక్షలు కరోనా కేసులు
శంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. గత కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా బారినపడినవారి …
Read More »జవహర్‌నగర్‌లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్(వేస్ట్ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఘన …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-8వ రౌండ్ ముగిసేవరకు..!
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం 200 అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదట ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. ఆరో రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థే వరుసగా ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు.
Read More »మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు- బీజేపీ 15, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం
మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం 11.00 గంటల వరకూ జరిగిన లెక్కింపులో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. బీఎస్‌పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన జ్యోతిరాదిత్య ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందా అనే దానిపై పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే స్పష్టత వస్తుంది. బీజేపీ …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-6వ రౌండ్‌లో కారు జోరు
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఆరు రౌండ్ల పూర్తయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరు రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే 2,667 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థే కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకూ 45,175 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఆరో రౌండ్ ఫలితాలు ఇలా.. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్
తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్‌దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-4రౌండ్లో బీజేపీ జోరు
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కూడా ముగిసింది. వరుసగా నాలుగు రౌండ్లలోనూ బీజేపీయే తన హవాను కొనసాగిస్తోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాగా దుబ్బాకలో ఇప్పటి వరకూ దుబ్బాకలో 28,074 ఓట్ల లెక్కింపు పూర్తైంది. 2,684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కొనసాగుతున్నారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ముందంజ
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కారు జోరు అప్పుడే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉంది. ఈ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలను తెరిచింది. కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎంల మొదటి రౌండ్ లెక్కింపు షురూ అయ్యింది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బీజేపీ …
Read More »