కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు ప్రకటన
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ …
Read More »మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు
చత్తీస్‌గఢ్ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …
Read More »గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ …
Read More »లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు ఇవే..!
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనను కచ్చితంగా …
Read More »72 ఏళ్ల తర్వాత..మళ్లీ హైదరాబాద్ లో అదే సీన్
గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. …
Read More »ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను …
Read More »నా రియల్ లైఫ్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు…నారా లోకేశ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “నా బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నాను. నాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, నాతో కలిసి అల్లరి చేస్తూ, కొంటె పనుల్లో భాగస్వామిగా ఉంటూ, నాతో కలిసి పెద్ద పెద్ద పనులు చేసే నా …
Read More »‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ఈసీ తీరుపై మంత్రి బుగ్గన ఫైర్
‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు …
Read More »ఎమ్మెల్యే కుమార్తె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే సురేష్ ధక్కడ్ కుమార్తె జ్యోతి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్తాన్‌లోని తన మెట్టినింట్లో ఆమె ఆత్మహత్యకు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. జ్యోతి భర్త డా. జైసింగ్ రాజస్తాన్ వైద్య విభాగంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. కాగా సురేష్ ధక్కడ్ మధ్యప్రదేశ్‌లోని పొహారీ …
Read More »