Breaking News
Home / CRIME (page 21)

CRIME

నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Read More »

ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్‌ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు …

Read More »

శరత్ కుమార్ ,రాధిక లకు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?

తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …

Read More »

మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …

Read More »

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్‌ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read More »

కంగనా రనౌత్ పై కేసు నమోదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది

Read More »

భర్తకు బట్టతల ఉందని భార్య..?

భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …

Read More »

టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా

మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.

Read More »

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino