దేశంలో పెట్రోల్ ధర పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 …
Read More »అతనికి దేవతగా కరోనా వైరస్
దేశ ప్రజలను కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. కరోనా నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను పారదోలేందుకు కొందరైతే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఎవరి విశ్వాసం …
Read More »కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …
Read More »బీజేపీ నేతకు కరోనా
కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..
Read More »ఢిల్లీ సీఎంకు కరోనా నెగిటివ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురైన సంగతి విదితమే. దీంతో ఆయన ఇంటి దగ్గర వైద్యులు శాంపిల్స్ సేకరించారు.శాంపీల్స్ ను పరీక్షలకు పంపించగా నెగిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా సీఎం అరవింద్ జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి విధతమే..
Read More »కొత్త విద్యాసంవత్సరంపై కేంద్ర కీలక ప్రకటన
దేశ వ్యాప్తంగా రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘ …
Read More »రాజ్యసభ బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్.డి.దేవెగౌడ జూన్ 19న జరగున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి నేడు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకుల కోరిక మేరకు ఆయన పోటీకి అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 34 మంది జేడీఎస్ …
Read More »అమెరికా తర్వాత భారత్‌లోనే ‘సీరియస్’!
కొవిడ్ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …
Read More »ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.దాదాపుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. మహరాష్ట్రలో 88,528,తమిళనాడులో 33,229,ఢిల్లీలో 29,943,గుజరాత్ రాష్ట్రంలో 20,545,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,947,రాజస్థాన్ లో 10,763,మధ్యప్రదేశ్ 9,638,వెస్ట్ బెంగాల్ 8,613,కర్ణాటక లో 5,760కేసులు నమోదయ్యాయి..
Read More »తెలంగాణ బాటలో తమిళనాడు
పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.
Read More »