ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పని సరైంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్ 7ను …
Read More »పసుపు రైతులు కన్నెర్ర..!
తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …
Read More »పాక్ వక్రబుద్ధి
దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు …
Read More »చిదంబరానికి సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటీషన్ తిరస్కరణ…!
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను …
Read More »ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం …
Read More »అరుణ్ జైట్లీకి కన్నీటీ వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు…!
నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కమలం పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు దివంగత …
Read More »అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర..!
బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి …
Read More »వీజీ సిద్దార్థ మరణంపై కంటతడి పెట్టించే వ్యాఖ్యలు చేసిన ఆయన స్నేహితుడు
కేఫ్ కాఫీ డే అనే మూడు అక్షరాలతో కట్టిపడేసిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తన పరుగును ఒక్కక్షణంలో ముగించడంతో తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ ధవళ ఒకరు ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించారు. యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందనడంలో సందేహం లేదు. అందరినీ కలుపుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ఆయన.. ఎందుకు అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారో దేశ ప్రజల మెదళ్లను ఇంకా తొలుస్తూనే …
Read More »శత్రు దేశాలు ఇక భారత్ అంటే వణకాల్సిందే.. ఓ వైపు షా, మరోవైపు దోవల్
ఆయన ఇండియన్ జేబ్స్ బాండ్., కొన్నేళ్లుగా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి.. ఉగ్రవాదులను పసిగట్టేందుకు ప్రాణాల ఫణంగా పెట్టి ఇన్ఫర్మేషన్ సేకరించిన గూఢచారి అజిత్ దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ఉగ్రవాద ప్రభాల్యం ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించి సత్తా చాటారీయన.. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అయిన దోవల్‌కు మోదీ కీలక బాధ్యతనే అప్పగించారు. …
Read More »రేపు మధ్యాహ్నం అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా …
Read More »