శ్రీలంకలో పూర్తిగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమ ప్రతాపాన్ని నేరుగా అధ్యక్షుడిపైనే చూపించారు. శనివారం లక్షలాది మంది ప్రజలు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఆర్థిక సంక్షోభంతో నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు..మహోగ్రరూపంతో అధ్యక్షుడు …
Read More »ఒకే పాఠశాలలో 31మందికి కరోనా పాజిటీవ్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. అంతేకాకుండా 10 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. కాగా నిన్న దేశవ్యాప్తంగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »దేశంలో కొత్తగా 18,840 కరోనా కేసులు
దేశంలో గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 18,840 కరోనా కేసులు నమోదయ్యాయి. 43 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక తాజాగా 16,104 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,26,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్..
ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఘనా దేశంలో మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నారు. ఇటీవల రెండు కేసులు నమోదు కాగా తాజాగా ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వారితో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరు బాధితుల్లోనూ డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో …
Read More »అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం.. పదిమంది మృతి
జమ్ముకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది యాత్రికులు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా కుంభవృష్టి వర్షం కురవడంతో మృతుల …
Read More »ఆ 4గురికి రాజ్యసభ
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష ఉన్నారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెర్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస …
Read More »మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »దేశంలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు.కొత్తగా 35 మంది మరణించగా, …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్న మంగళవారం 13,086 కేసులు నమోదయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది కరోనా భారీన మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో …
Read More »వంట గ్యాస్ సిలిండర్ పై సామాన్యులకు షాక్
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే …
Read More »