ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …
Read More »UP Exit Polls- 2022.. గెలుపు ఎవరిది..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే …
Read More »ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..ఎక్కడ ఏ పార్టీ?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. నేటితో చివరి దశ పోలింగ్ పూర్తయింది. మార్చి 10న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పిబ్రవరి 10న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. మ్యాట్రిజ్,పీమార్క్, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్, ఆత్మసాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జన్‌కీ బాత్-ఇండియా న్యూస్ తదితర సంస్థలు …
Read More »దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »యూపీలో బీజేపీకి షాక్
యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »దేశంలో కొత్తగా 5,476 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,476 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 158మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 26,19,778 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ
చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన
రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.
Read More »రష్యా కు షాక్ – ఐరాస సంచలన నిర్ణయం
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. భద్రతామండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.
Read More »