భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అడ్డుకున్న ఘటనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(United World Wrestling) శాఖ స్పందించింది. రెజ్లర్ల అరెస్టును యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ఖండించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేసింది. ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు …
Read More »దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సరోజినీ గార్డెన్స్ లో సీనియర్ నాయకుడు కుంట సిద్ధిరాములు గారి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అభివృద్ధిని …
Read More »విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని వెంకట్ రామ్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న సుహూర్ అనే వ్యక్తి రేకుల ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు కూలడంతో అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. నిరుపేదలు కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేల ఆర్థిక …
Read More »ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయొద్దని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు …
Read More »ఇండియా గేట్ వద్ద రెజ్లర్లు ఆమరణ నిరాహార దీక్ష
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల …
Read More »టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »అన్ని రంగాల్లో దూసుకుపోతోన్న అచ్చంపేట నియోజకవర్గం
నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని మన్ననూరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అచ్చంపేట …
Read More »రాష్ట్ర ప్రగతిని చాటేలా దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు .అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, …
Read More »రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ కెరీర్‌కు స్వస్తి పలికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు సొంతం చేసుకున్నది. …
Read More »